

‘సలార్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెలలో థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ‘ఖలీఫా’ అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ అమీర్ అలీ పాత్రలో నటించారు. మాళవిక శర్మ కథానాయికగా కనిపించగా, మోహన్‌లాల్, టొవినో థామస్ అతిథి పాత్రల్లో నటించారు. సాధారణ టెక్స్టైల్స్ వ్యాపారిగా జీవించే అమీర్ అలీ జీవితంలో తండ్రి అనూహ్యంగా అరెస్టు కావడంతో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో తన కుటుంబానికి బంగారం స్మగ్లింగ్ సామ్రాజ్యంతో సంబంధం ఉందనే విషయాన్ని అతడు తెలుసుకుంటాడు.
కుటుంబ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడంతో పాటు తన స్థానాన్ని బలపరుచుకునేందుకు అమీర్ అలీ అండర్‌వరల్డ్, గోల్డ్ స్మగ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అక్కడ అతడు ఎదుర్కొనే పరిస్థితులు, అధికార పోరు, కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నాల చుట్టూ కథ సాగుతుంది. అక్టోబర్ 9 నుంచి Amazon Prime Video, Lionsgate Play, aha Telugu, ManoramaMAX, Simply South, StarzPlay ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రానుండటంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!