

ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన రోమ్‌కామ్ సినిమా ఎపిక్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రెస్పాన్స్ దక్కకపోవడంతో ఇప్పుడు ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శివాజీతో పాటు పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయిన ఎపిక్‌కు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!