
సినిమాలు

ప్రముఖ మోటో వ్లాగర్ మరియు బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ అనురాగ్ దోభాల్ (యూకే07 రైడర్) శనివారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే పై ఆయన టయోటా ఫార్చ్యూనర్ కారును గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో కనిపించారు.
లైవ్ సమయంలో భావోద్వేగానికి లోనైన అనురాగ్, తన తల్లికి సందేశం ఇస్తూ తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. అనంతరం కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనను లైవ్ చూస్తున్న వేలాది మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, గాయపడిన అనురాగ్‌ను మీరట్‌లోని సుభారతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సమస్యల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని వార్తలు చెబుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!