

గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల భూమి క్రమబద్ధీకరణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ భూములను పరిశీలించేందుకు విశాఖపట్నంలోని వైసీపీ నేతల బృందం గురువారం యూనివర్సిటీ వద్దకు చేరుకుంది. అయితే యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద భద్రతా సిబ్బంది ఆ బృందాన్ని అడ్డుకోవడంతో అక్కడే వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ఈ పరిణామంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. గీతం యూనివర్సిటీ ఆధీనంలోని 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రతిపాదించిన తీర్మానాన్ని విశాఖలోని వైసీపీ కార్పొరేటర్లు, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుని, ఆందోళన తీవ్రత పెరగడంతో అరెస్టులకు సిద్ధమయ్యారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!