

నగరంలోని కూకట్పల్లిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో (జేఎన్టీయూ) భారీ జిరాక్స్ కుంభకోణం వెలుగుచూసింది. యూనివర్సిటీ లైబ్రరీలో అనధికార వ్యక్తులు దాదాపు 18 ఏళ్లుగా జిరాక్స్ సెంటర్ను నిర్వహిస్తూ సుమారు రూ.3 కోట్ల అక్రమ వ్యాపారం చేసినట్లు ప్రాథమికంగా తేలింది. 2008 లో విద్యార్థుల సౌకర్యార్థం ఒక సంస్థకు తాత్కాలిక అనుమతి ఇచ్చినా, ఆ సంస్థ తప్పుకోవడంతో అదే పేరుతో అనధికారులు వ్యాపారం కొనసాగించినట్లు తెలుస్తోంది.
ఇటీవల వ్యాపారం కొనసాగించేందుకు రూ.4 లక్షలు డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైస్ చాన్స్లర్ ఆదేశాలతో జిరాక్స్ సెంటర్ను అధికారులు సీజ్ చేసి, సమగ్ర విచారణకు రెక్టార్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ నిర్ణయించిన ధరలకు మించి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే ఈ అక్రమాలు ఇన్నేళ్లూ కొనసాగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!