

దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధించాలంటే 2050 నాటికి శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 55 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం షీ మార్ట్స్ అమలుకు శ్రీకారం చుట్టింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో రెండేళ్ల క్రితం స్వర్ణభారతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో, నాబార్డు సహకారంతో రూరల్ మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే 5 నుంచి 20 శాతం తక్కువకు విక్రయిస్తున్నారు.
ఇటీవల కేంద్ర బడ్జెట్లో లఖ్పతి దీదీ పథకం విస్తరణలో భాగంగా షీ మార్ట్స్ రిటైల్ అవుట్లెట్ల ఏర్పాటు ప్రతిపాదించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మార్ట్స్ ద్వారా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ సదుపాయం కల్పించడంతో పాటు వ్యాపార నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. నైపుణ్య శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకు రుణాలు అందిస్తారు. జిల్లాలో 11 మండల సమాఖ్యలు, 421 గ్రామ సంఘాలు, 11,125 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉండగా, మొత్తం 1,33,500 మంది మహిళా సభ్యులు ఈ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!