

ఆరావళి పర్వత శ్రేణిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమబాట పట్టారు. పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అధిక మైనింగ్ కారణంగా అడవులు నాశనం అవుతున్నాయని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతున్నదని మహిళలు ఆరోపిస్తున్నారు. పర్యావరణ నిబంధనలను పాటించకుండా మైనింగ్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని, దీని వల్ల గ్రామాల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు అంటున్నారు.
ఈ క్రమంలో మహిళలు సేవ్ ఆరావళి పేరుతో సోషల్ మీడియా ప్రచారం చేపడుతూ, ప్రజలను చైతన్యపరుస్తున్నారు. అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, పర్యావరణ సమతుల్యతకు కీలకమైన ఆరావళి పర్వతాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ ఉద్యమానికి పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజల మద్దతు పెరుగుతుండగా, స్థిరమైన అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మరింత బలపడుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!