
గాసిప్స్

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వుగా గుర్తింపు పొందిన నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల గణనకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈ నెల 20 వ తేదీ నుంచి వారం రోజుల పాటు పులులతో పాటు ఇతర వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది.
ఈ గణన ప్రక్రియలో పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులను భాగస్వాములుగా తీసుకోనుంది అటవీ శాఖ. దాదాపు 160 మంది అటవీశాఖ సిబ్బంది, 800 మంది వరకు జంతు ప్రేమికులు, మరో 100 మంది అదనపు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రోజుకు 7 నుంచి 10 కిలోమీటర్లు అడవిలో నడుస్తూ పులుల పాదముద్రలు, విసర్జితాలు వంటి ఆధారాలను పరిశీలిస్తూ వన్యప్రాణుల సంఖ్యను అంచనా వేస్తారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!