
క్రీడలు

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కురిసిన భారీవర్షానికి బీఆర్టీఎస్ ప్రధాన రహదారిపై ఫ్లెక్సీలు, హోర్డింగులు ఎగిరిపోయాయి. సరిపల్లి సమీపంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కుమారుడి వివాహం కోసం ఏర్పాటు చేసిన పెళ్లి సెట్టింగ్ గాలివాన ప్రభావంతో కూలిపోయింది.
ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ అరేనా క్రికెట్ మైదానం వర్షపు నీటితో పూర్తిగా జలమయమైంది. దీంతో అక్కడ జరుగుతున్న జాతీయ దివ్యాంగుల వీల్‌చెయిర్ క్రికెట్ పోటీలను అర్ధాంతరంగా నిలిపివేసి, అప్పటివరకు నమోదైన గణాంకాల ఆధారంగా విజేతలను ప్రకటించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!