
.webp&w=3840&q=75)
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 కు సంబంధించిన వార్షిక ‘అంతర్జాతీయ నష్ట ప్రమాద నివేదిక’ ను స్విట్జర్లాండ్లోని దావోస్లో విడుదల చేసింది. వివిధ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాలు, సైబర్ నేరాలు, తప్పుడు సమాచార వ్యాప్తి వంటి పరిణామాల నేపథ్యంలో, వచ్చే రెండేళ్లలో ‘భౌగోళిక, ఆర్థిక ఘర్షణలు’ ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా పేర్కొంది. 1,300 మంది ప్రముఖులు, రంగ నిపుణుల సర్వే ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో 2026 నాటికి భౌగోళిక ఆర్థిక ఘర్షణలు, సాయుధ ఘర్షణలు, విపత్కర వాతావరణ పరిస్థితులు, సామాజిక విభజన, తప్పుడు సమాచార వ్యాప్తి టాప్ ఐదు ముప్పులుగా గుర్తించింది.
దీర్ఘకాలికంగా వాతావరణ వైపరీత్యాలు, జీవవైవిధ్య నష్టం, పర్యావరణ వ్యవస్థల పతనం, భూమి ఆవరణ మార్పులు, ఏఐ సాంకేతికతల ప్రతికూల ప్రభావాలు ప్రధాన ముప్పులుగా ఉంటాయని డబ్ల్యూఈఎఫ్ హెచ్చరించింది. భారత్ విషయంలో వచ్చే రెండేళ్లలో సైబర్ అభద్రతను అతిపెద్ద ముప్పుగా పేర్కొనగా, ఆదాయ అసమానతలు, సామాజిక భద్రత–ప్రజాసేవల లోపం, ఆర్థిక క్షీణతలను కూడా తీవ్ర సవాళ్లుగా తెలిపింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, భారత్కు చెందిన యూపీఐని ఉత్తమ ఉదాహరణగా ప్రశంసించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!