
సినిమాలు

ఇటీవల భారీ నష్టాల తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరింత జాగ్రత్తగా తన తదుపరి ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ‘ది రాజా సాబ్’ సినిమాతో ఎదురైన ప్రభావం తర్వాత, సంస్థ 2027 లక్ష్యంగా బలమైన లైనప్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్ 2’ షూటింగ్ దశలో ఉండగా, మరోవైపు ‘జాంబీ రెడ్డి 2’పై కూడా చర్చలు కొనసాగుతున్నాయి.
ఇక ఈ క్రమంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. యంగ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కథ ఇప్పటికే సిద్ధమై టైగర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడి ఎంపిక తుది దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద రిస్క్ తీసుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!