

బాలీవుడ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ కొత్త భారీ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో సీక్వెల్ మరింత ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు.
ఆమిర్ ఖాన్ ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో కలిసి చారిత్రాత్మక క్రీడా నేపథ్య చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా భారత క్రికెట్ దిగ్గజం లాలా అమర్‌నాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. భారత–పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ ప్రారంభ దశల సంఘటనలు ఇందులో ప్రధానంగా ఉండనున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయిందని, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంపై పూర్తిగా దృష్టి పెట్టడంతో ‘త్రీ ఇడియట్స్ 2’ ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. 2027 తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!