
సినిమాలు

కోలీవుడ్ స్టార్ శింబు మరోసారి టాలీవుడ్‌లో బలమైన రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఆశించిన విజయాలు లేక కాస్త విరామం తీసుకున్న ఆయన, దర్శకుడు కీర్తీశ్వరన్ చెప్పిన కొత్త కథకు ఇంప్రెస్ అయ్యి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మొదట మైత్రీ మూవీ మేకర్స్‌లో రూపొందాల్సిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన స్టైలిష్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించే ఆలోచనలో టీమ్ ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!