
సినిమాలు

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో భారీ ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ‘జటాయు’ సినిమాను దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. గత రెండేళ్లుగా కథపై పని చేసిన ఆయన గ్రాండ్ విజువల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. మొదట విజయ్ దేవరకొండను అనుకున్నా, తర్వాత రోషన్ మేకా హీరోగా ఎంపికయ్యారు.
ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో రిస్క్ అనే చర్చ సాగుతోంది. ఇంద్రగంటి ఇటీవల హిట్ లేకపోవడం, రోషన్ కెరీర్ ప్రారంభ దశలో ఉండటం కారణంగా ఈ సినిమా సవాల్‌గా భావిస్తున్నారు. అయినప్పటికీ కథపై నమ్మకంతో దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. 2027 టార్గెట్‌గా ఆయన బలమైన లైనప్ సిద్ధం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!