

సంక్రాంతి సంబరాల భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ మూడో రోజుకు చేరింది. ఈనెల 13 న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నగరవాసులు పరేడ్ గ్రౌండ్ వద్ద క్యూ కట్టుతున్నారు. గత రెండు రోజుల్లో ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా సందర్శకులు ఫెస్టివల్లో పాల్గొన్నారు. అధికారులు అంచనా ప్రకారం, ఫెస్టివల్ చివరి రోజున ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండనుందని భావిస్తున్నారు.
ఫెస్టివల్‌ను తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘సెలబ్రేట్ ది స్కై’ పేరుతో నిర్వహిస్తున్నారు. 19 దేశాల నుంచి వచ్చిన 40 అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 జాతీయ కైట్ ఫ్లయర్స్ డ్రాగన్లు, డాల్ఫిన్లు, కార్టూన్ క్యారెక్టర్స్ మరియు ఇతర అద్భుత డిజైన్ల గాలిపటాలను ఎగురవేస్తున్నారు. రంగురంగుల పతంగులు ఆకాశంలో ఎగురుతూ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే, ఫెస్టివల్లో తెలంగాణ సంప్రదాయ నృత్యాలు, ఫోక్ ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్స్, మరియు వివిధ రాష్ట్రాల, దేశాల సంప్రదాయ మిఠాయిలు కూడా సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!