

తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కుటుంబంలో జరుగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. తనకు విడాకులు కావాలంటూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన విజయ్ సతీమణి సంగీత తాజాగా మరోసారి చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విడాకుల కేసు తీర్పు వచ్చే వరకు విజయ్‌కు చెందిన నీలాంకరై నివాసంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చెన్నైలో తనకు నివాసం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె కోర్టుకు తెలిపారు.
కోట్ల రూపాయలు సంపాదిస్తున్న విజయ్ తనకు మరియు తన పిల్లలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వాలని సంగీత కోరారు. నీలాంకరైలోని ఆ ఇల్లు తనకు కూడా సమాన హక్కుతో ఉందని ఆమె పేర్కొన్నారు. అక్కడ నివసించేందుకు అనుమతి కోరగా న్యాయవాది ద్వారా బెదిరింపులు వస్తున్నాయని పిటిషన్లో తెలిపారు. ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం. ప్రస్తుతం సంగీత లండన్‌లో ఉండగా కుమారుడు జాసన్ సంజయ్ అశోక్ నగర్లో అద్దె ఫ్లాట్‌లో, కుమార్తె దివ్య సాషా విద్యార్థి వసతి గృహంలో ఉంటున్నట్లు తెలిసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!