

నటుడు, టీవీకే నాయకుడు విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ “జన నాయగన్” సినిమా వివాదంపై స్పందించారు. సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం, సన్నివేశాల లీక్ వంటి సమస్యలపై తాము ఆందోళన చెందలేదని చెప్పారు. ఈ సమస్యలు ముందుగానే ఊహించినవేనని, ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా విడుదలైతే ఆశ్చర్యపోయేవాళ్లమని ఆయన అన్నారు.
విజయ్ సినిమా మొదలుపెట్టే ముందు నిర్మాతకు తన రాజకీయ ప్రవేశం గురించి చెప్పాడని, అప్పుడు సినిమా విషయంలో అడ్డంకులు రావచ్చని స్పష్టంగా తెలియజేశాడని చంద్రశేఖర్ తెలిపారు. రాజకీయ ప్రత్యర్థుల కారణంగానే సినిమా లీక్ అయ్యిందని ఆయన ఆరోపించారు. కుటుంబం లేదా ప్రజలు అనే పరిస్థితి వస్తే విజయ్ ప్రజలనే ఎంచుకున్నాడని కూడా అన్నారు.
హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ నటించిన ఈ సినిమా జనవరిలో విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఇటీవల కొన్ని సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కోయంబత్తూరులో ఒక స్థానిక ఛానల్‌లో కూడా సినిమా ప్రసారం కావడం కోలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ లీక్ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!