

విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రౌడీ జనార్దన సినిమా పై ప్రస్తుతం మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంపై కొత్త సమాచారం వినిపిస్తోంది. ఆ క్లైమాక్స్ కోసం విజయ్ దేవరకొండ రిస్కీ యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఆ సన్నివేశంలో ఆయన లుక్ కూడా చాలా భిన్నంగా ఉండబోతుందని చెబుతున్నారు. అలాగే ఈ క్లైమాక్స్‌లో ఒక ప్రత్యేక పాత్ర కనిపించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర మరియు లుక్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే లుక్ పరీక్ష కూడా పూర్తయిందని చెబుతున్నారు. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.








.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!