
న్యూస్

విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న జన నాయగన్ సినిమా పై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ సినిమాను విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు అనేక అడ్డంకులు ఎదురవడంతో ఇప్పటి వరకు స్పష్టమైన విడుదల తేదీ ప్రకటించలేదు.
ఇప్పుడేమో ఈ సినిమా వచ్చే నెల 8న థియేటర్లలో విడుదల కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని యోచిస్తున్నారని సమాచారం. మరోవైపు సూర్య నటించిన మరో సినిమా వచ్చే నెల 15 తేదీకి రావచ్చని టాక్ ఉంది. అయినప్పటికీ జన నాయగన్ కోసం వచ్చే నెల 8వ తేదీనే నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా కేవీఎన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!