

దక్షిణాదిలో తన సహజ నటనతో మంచి గుర్తింపు పొందిన సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ ‘ఏక్ దిన్’ సినిమా ప్రమోషన్స్‌లో భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్, జునైద్ ఖాన్‌లతో కలిసి పాల్గొన్న ఆమె, తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. “నేను ఏం చేశానో తెలియదు, కానీ నా పని నన్ను ఇంతమంది ప్రతిభావంతుల మధ్యకు తీసుకువచ్చింది. ఈ క్షణంలో చాలా వినమ్రంగా అనిపిస్తోంది” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా జునైద్ ఖాన్‌ను ప్రశంసిస్తూ, ఆయన మంచి సహనటుడని చెప్పారు. సినిమా కథను చిత్ర బృందం చెప్పిన విధానం చాలా బాగుందని, వారు వివరించేటప్పుడు సన్నివేశాలు కళ్లముందే కనిపించాయని అన్నారు. మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో దశాబ్ద కాలంగా చేసిన ప్రయాణమే తనను ఇక్కడికి తీసుకువచ్చిందని తెలిపారు. “ఇది నా తొలి హిందీ సినిమా. నిజంగా చాలా ఎమోషనల్‌గా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆమిర్ ఖాన్‌కి ధన్యవాదాలు” అని సాయి పల్లవి చెప్పారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘ఏక్ దిన్’ సినిమా, థాయ్ చిత్రం ‘వన్ డే’కి రీమేక్‌గా రూపొందుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!