

భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ ఫైనల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. డెన్మార్క్‌లోని హోర్సెన్స్‌లో సోమవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 5-0తో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో చైనా 4-1తో కెనడాను ఓడించింది. ఇప్పటికే కెనడాపై 4-1తో గెలిచిన భారత్, ఈ విజయంతో నాకౌట్ దశలోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగే గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత్-చైనా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా గ్రూప్-ఏలో అగ్రస్థానం దక్కించుకునే జట్టు ఏదో తేలుతుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-14, 21-16తో గెలిచి భారత్‌కు మంచి ఆరంభం ఇచ్చాడు. తరువాత అయుష్ శెట్టి 21-8, 21-6తో సులభంగా విజయం సాధించాడు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 21-14, 21-16తో గెలిచి స్కోర్‌ను 3-0కి తీసుకెళ్లింది. అనంతరం హెచ్.ఎస్. ప్రణయ్ మరియు హరిహరన్-అర్జున్ జంట కూడా విజయాలు సాధించడంతో భారత్ 5-0తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!