
న్యూస్

పారడైజ్ బిర్యానీ మరిన్ని నగరాలకు తన ప్రత్యేక బిర్యానీ రుచులను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కీలక నగరాల్లో తన ఉనికిని బలపరచడానికి దాదాపు ₹100 కోట్ల నిధులను సమీకరించే ప్రణాళికను రూపొందించింది.
ఈ సంస్థకు మద్దతుగా ఉన్న సమారా క్యాపిటల్ విస్తరణ కోసం అవసరమైన నిధుల సమీకరణకు పలు భారత కుటుంబాల కార్యాలయాలతో చర్చలు జరుపుతున్నారు. దాదాపు 10–12 శాతం వాటాను కొత్త వెస్టర్లకు విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిధులతో వచ్చే మూడు సంవత్సరాల్లో దాదాపు 100 కొత్త ఔట్లెట్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, గురుగ్రామ్ వంటి నగరాల్లో కలిపి సుమారు 57 ఔట్లెట్లను నిర్వహిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!