
సినిమాలు

‘కేడీ: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాటపై నెలకొన్న వివాదంపై దర్శకుడు ప్రేమ్ స్పందించారు. ఈ పాటలోని హిందీ లిరిక్స్ అర్థం తనకే తెలియదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అన్ని వేదికల నుంచి ఈ పాటను తొలగించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ వివాదంపై స్పందిస్తూ ప్రేమ్, దేశంలో ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉన్నప్పటికీ పాటల లిరిక్స్‌పై అనవసరంగా వివాదాలు సృష్టించడం అవసరం లేదన్నారు. ఇది ఒక ఎమోషనల్ మూవీ అని, పాట కేవలం సరదా భాగమని చెప్పారు. ఈ చిత్రంలో ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తుండగా, నోరా ఫతేహి, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
.jpg&w=3840&q=75)

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!