
.jpeg&w=3840&q=75)
భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భద్రాచలం మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణం వేలాది భక్తుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడగా, సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.
మిథిలా స్టేడియంలో శ్రీ రామచంద్రస్వామి, సీతమ్మ వారికి ప్రత్యేక పూజలు, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించి వివాహ వేడుకను కొనసాగించారు. ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో అన్ని కార్యక్రమాలను నిర్వహించగా, భద్రాచలం ఆలయం సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. భక్తుల రాకపోకలతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల భారీ రద్దీ కారణంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టగా, తాగునీరు, అన్నప్రసాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించారు.

ఇక అంతకుముందు ఉదయం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద రూ.351 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి తొలి దశ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్‌తో పాటు న్యాయమూర్తులు, ఎండోమెంట్ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు మీడియా ప్రతినిధులు, లక్షలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









.jpg&w=3840&q=75)




.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!