
సినిమాలు

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి పరిస్థితుల కారణంగా ఇంధన కొరత వస్తుందన్న వదంతులు వ్యాపించడంతో కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా కొనుగోళ్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే దేశంలోని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.
ప్రజలు భయాందోళనలకు గురై అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా కూడా సాధారణంగానే కొనసాగుతోందని, డిస్ట్రిబ్యూటర్ల వద్ద కొరత లేదని తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!