
న్యూస్
.webp&w=3840&q=75)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోను పంచుకున్నారు. జనవరి 31న ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, తాను రెండోసారి గర్భవతి అయినప్పటి నుంచి సీమంతం వరకు, అలాగే ప్రసవానికి ముందు ఎదుర్కొన్న టెన్షన్.. పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో నెలకొన్న సందడిని ఆ వీడియోలో చూపించారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. "ఈ వీడియో చూసినప్పుడల్లా నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. ప్రసవ సమయంలో అపోలో ఆస్పత్రి వైద్యులు అందించిన సేవలు, రామ్చరణ్ అభిమానులు చూపిన మద్దతు ఎప్పటికీ మరువలేను. మా కుటుంబంపై ఇంతటి ప్రేమాభిమానాలను కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!