
.png&w=3840&q=75)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 83 పేజీలతో ‘తెలంగాణ రైజింగ్ విజన్’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్లో యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది.
విజన్ డాక్యుమెంట్లో 10 కీలక వ్యూహాలను రూపొందించారు. ఇందులో సమతుల్య అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, విధానపరమైన నిర్ణయాల ప్రోత్సాహం, గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యం వంటి అంశాలను కవర్ చేస్తుంది. ముఖ్య ప్రాజెక్టులు: ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, గ్రీన్‌ఫీల్డ్ హైవే, RRR, రింగురైలు, బుల్లెట్ రైలు.
ఇంతేకాక, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం, కళలు, పర్యాటకం, పాలనలో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకూ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ విధంగా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలను రూపొందించడం ప్రధాన లక్ష్యం.


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!