
.jpg&w=3840&q=75)
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవల కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా, వచ్చే ఫిబ్రవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్లను తితిదే ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. భక్తులు నిర్ణీత సమయానికి వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ విధానం ద్వారా కేటాయిస్తారు. లక్కీడిప్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. లక్కీడిప్‌లో ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపు పూర్తి చేయాలి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం వంటి సేవలకు సంబంధించిన టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదేరోజు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటా మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు అందించబడుతుంది.
అంగ ప్రదక్షిణ టోకెన్లు ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయి. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లు కూడా అదేరోజు ఉదయం 11 గంటలకు విడుదల అవుతాయి.
వృద్ధ భక్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు 24 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేయబడతాయి.
ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను 25 వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో పెడతారు. అదే రోజు తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో అద్దె గదుల ఆన్లైన్ బుకింగ్ కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
భక్తులందరూ తితిదే అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే : ttdevasthanams.ap.gov.in
ఆర్జిత సేవలు మరియు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!