

తిరుమల భక్తులకు టీటీడీ నుంచి కీలక అప్డేట్ అందింది. భక్తులకు అందించే అన్నప్రసాదాల వ్యవస్థను మరింత విస్తరించే దిశగా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అందించే రుచికరమైన అన్నదానాన్ని ఇప్పుడు టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారు.
తాజాగా జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధంలో నడుస్తున్న ఆలయాల్లో అన్నప్రసాదాలు తయారు చేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే ఇంకా ఎక్కడైనా అన్య మతసంబంధ సిబ్బంది ఉన్నా, వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను వేగవంతం చేయాలని కూడా ఈవో ఆదేశించారు. ప్రస్తుతం టీటీడీ పరిధిలోని 15 ఆలయాల్లో అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ నెల 31 నుంచి మరో 19 ఆలయాలలో కూడా అన్నదాన సేవ ప్రారంభం కాబోతోంది. మిగిలిన 26 ఆలయాల్లో 2026 ఫిబ్రవరి 28 నుంచి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభం కానుంది. ఇదే సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయంలో ఇప్పటికే అన్నప్రసాదం కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!