
సినిమాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వచ్చిన వివాదం నేపథ్యంలో ఈ బదిలీ జరిగినట్లు సమాచారం. ఈ అంశంపై సిట్ నివేదిక వెలువడిన తర్వాత పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణల యుద్ధం కొనసాగుతోంది. నెయ్యి కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లపై అప్పట్లో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ సంతకాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో, ఈ వ్యవహారం మరింత రాజకీయంగా వేడెక్కింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!