

కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం సుదీర్ఘంగా జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు వంటి అంశాలు డిజిటల్ విధానంలో జరుగుతున్న నేపథ్యంలో, పార్టీ సభ్యత్వ నమోదును కూడా డిజిటల్ పద్ధతిలో చేపట్టాలని సమావేశం అభిప్రాయపడింది.
ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. అలాగే మండలాలు, మున్సిపల్ బాడీల స్థాయిలో సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. డిజిటల్ సభ్యత్వ నమోదు విధానంపై ప్రత్యేక శిక్షణా శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!