

సీనియర్ నటుడు నాగార్జున తన పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ దుస్తుల వ్యాపారి తన ఫొటోలు, పేరుతో టీ షర్టులు విక్రయిస్తున్నాడని నాగార్జున కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు వ్యాపారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించింది.
వ్యాపారి తరఫు న్యాయవాది శృతి అయ్యర్ వాదనలు వినిపిస్తూ ది ఘోస్ట్ చిత్రానికి తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని తెలిపారు. ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ప్రొడక్షన్ హౌస్‌తో ఒప్పందం కుదిరిందని, నాగార్జున స్వయంగా ఆ ఉత్పత్తులను ప్రమోట్ చేశారని వాదించారు. అయితే నాగార్జున తరఫు న్యాయవాది ఈ వాదనలను ఖండిస్తూ సరైన ఒప్పంద పత్రాలు సమర్పించలేదని కోర్టుకు తెలిపారు. సమర్పించిన ఈ-మెయిల్ కాపీలు కూడా అసంపూర్ణంగా ఉన్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!