
గాసిప్స్

స్విర్జర్లాండ్లోని దావోస్(Davos)లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) సదస్సు జరుగుతోంది. దీనికి హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్(Air Force One)లో బయల్దేరారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రెస్ క్యాబిన్లో కొద్దిసేపు లైట్లు ఆగిపోయినట్లు సమాచారం.
దీంతో అప్రమత్తమైన విమానయాన సిబ్బంది వెంటనే ఆ ఫ్లైట్‌ను వెనక్కి తిప్పి వాషింగ్టన్ సమీపంలోని జాయింట్‌బేస్ ఆండ్రూస్(Joint Base Andrews)లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ట్రంప్ మరో విమానంలో తమ ప్రయాణం కొనసాగించారు. 2024 లోనూ ట్రంప్ ప్రైవేట్ విమానం ఒకటి మోంటానాకు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ రోజు కూడా ఆ ఫ్లైట్ ను బిలింగ్స్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!