
.png&w=3840&q=75)
మహారాష్ట్ర రాజకీయాలను బుధవారం తీవ్ర విషాదం కుదిపేసింది. ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం బారామతి సమీపంలో కూలిపోయినట్లు ప్రాథమిక కథనాలు వెలువడ్డాయి. ముంబై నుంచి బయలుదేరిన ఈ విమానం ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు పేర్కొనబడింది.
ఉదయం 8.10 గంటలకు VT-SSKగా నమోదైన లియర్‌జెట్ 45 విమానం ముంబై నుంచి బయలుదేరింది. 8.18 గంటలకు బారామతి విమానాశ్రయంతో సంప్రదింపులు ఏర్పడ్డాయి. విమానాశ్రయం పరిసరాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గినట్లు అధికారులు పైలట్లకు తెలియజేశారు. సుమారు మూడు కిలోమీటర్ల విజిబిలిటీ ఉందని సమాచారం ఇచ్చినా, ల్యాండింగ్ సమయంలో పరిస్థితులు క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
ల్యాండింగ్ విఫలమైన అనంతరం పైలట్లకు ‘గో-అరౌండ్’ చేయాలని సూచించారు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ఉదయం 8.43కి విమానం నుంచి వచ్చే ADS-B సిగ్నల్స్ అకస్మాత్తుగా నిలిచిపోయాయి. కొద్దిసేపటికి హైవే సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో భారీ పేలుడు, అగ్ని ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు ప్రారంభించింది. బారామతి విమానాశ్రయం పూర్తిస్థాయి ఏటీసీ లేని అన్‌కంట్రోల్డ్ ఎయిర్‌ఫీల్డ్ అని ప్రభుత్వం వెల్లడించింది.













.avif&w=3840&q=75)

కామెంట్స్ (1)
Very Sad