
క్రీడలు

పోలవరం ప్రాంతంలో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ భారీ స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు "ఆపరేషన్ హనుమాన్" పేరుతో ఈ మిషన్ చేపట్టారు. పులిని గుర్తించి బంధించేందుకు 200 మందికి పైగా అటవీశాఖ సిబ్బందిని రంగంలోకి దించారు. మొత్తం ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఆపరేషన్‌కు మరింత బలం చేకూర్చేందుకు బెంగళూరు నుంచి నిపుణుల బృందం రేపు రంపచోడవరం చేరుకోనుంది. పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతతో పాటు పులి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!