

ఏఐ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఏఐ విద్యను తప్పనిసరి చేసింది. కొత్త విధానం ప్రకారం మొదటి తరగతి నుంచే విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరంలో కనీసం 8 నుంచి 10 గంటలపాటు ఏఐ సంబంధిత పాఠాలు అభ్యసించాల్సి ఉంటుంది. చిన్న వయసు నుంచే డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడమే ఈ నిర్ణయ లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
విద్యార్థుల వయస్సును బట్టి పాఠ్యాంశాలను రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో కోడింగ్, ఇమేజ్ రికగ్నిషన్ రోబోలు, స్మార్ట్ పరికరాల వినియోగం వంటి అంశాలను బోధించనున్నారు. మిడిల్ స్కూల్‌లో జనరేటివ్ ఏఐ, డేటా నిర్వహణ, వాస్తవ జీవితంలో ఏఐ వినియోగాలపై అవగాహన కల్పిస్తారు. హైస్కూల్ స్థాయిలో న్యూరల్ నెట్‌వర్క్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐలో నైతిక అంశాలు, డేటా గోప్యత వంటి ఆధునిక విషయాలను బోధించనున్నారు. 2030 నాటికి ప్రపంచ ఏఐ శక్తిగా నిలవాలన్న చైనా లక్ష్యంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!