

హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 న అంతర్జాతీయ పతంగుల మరియు మిఠాయిల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఎగురవేసిన రంగురంగుల పతంగులతో ఆకాశం కళకళలాడింది. సంప్రదాయాల పరిరక్షణతో పాటు సాంస్కృతిక వైవిధ్యానికి ప్రోత్సాహం ఇవ్వడమే ఈ పండుగ ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌లోనే గాలిపటాల తయారీని ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో కొంత సమయం పర్యాటకానికి కేటాయిస్తే మానసిక ఉల్లాసంతో పాటు స్థానిక కళాకారులు, వ్యాపారులకు ఆర్థికంగా మద్దతు లభిస్తుందని అన్నారు. ఈ మూడు రోజుల పండుగను విజయవంతం చేయాలని కోరుతూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!