

ప్రయాణాన్ని సులభతరం చేయాల్సిన టోల్‌ప్లాజాలు ఇప్పుడు వాహనదారులకు సమస్యల కేంద్రాలుగా మారుతున్నాయి. భారీ మొత్తంలో టోల్ చెల్లించినప్పటికీ ఫాస్టాగ్ సరిగా స్కాన్ కాకపోవడం, లేన్‌ల మూసివేత, సిబ్బంది నిర్లక్ష్యం వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోవడం, ఒక్కసారిగా లేన్ మార్పులు, రివర్స్ చేయించటం వంటి పరిస్థితులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. జాతీయ రహదారులపై నిర్వహించిన సమగ్ర పరిశీలనలో వందకు పైగా సమస్యలు వెలుగులోకి రావడం గమనార్హం.
ఇక ఆక్రమణలు, అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. టోల్ గేట్ల సమీపంలో లారీలు నిలిపివేయడం, రహదారులపై చిన్న వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోంది. అనేక చోట్ల వెలుతురు లేకపోవడం, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, దెబ్బతిన్న డివైడర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సిబ్బంది కొరతతో కొన్ని లేన్‌లను మూసివేయడం వల్ల మిగిలిన లేన్‌లపై రద్దీ పెరుగుతోంది. వెంటనే చర్యలు తీసుకోకపోతే టోల్‌ప్లాజాలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!