

మేషం: సద్భావంతో చేసే పనులు త్వరగా నెరవేరతాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ప్రశాంతతను కాపాడుకోండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభం.
వృషభం: ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. అధికారులతో జాగ్రత్త అవసరం. దుర్గాదేవి దర్శనం మేలు.
మిథునం: కొత్త పనుల్లో ఆటంకాలు రాకుండా ప్రణాళిక అవసరం. అధికారులను ప్రసన్నం చేసుకునేలా వ్యవహరించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
కర్కాటకం: అనుకున్న పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలం. సమాజంలో మంచి పేరు. దైవారాధన వదలవద్దు.
సింహం: లక్ష్యంపై దృష్టితో ముందుకు సాగితే ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటించవచ్చు; సలహాలు తీసుకోండి. శత్రువులతో జాగ్రత్త. నవగ్రహ ఆరాధన శుభం.
కన్య: ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం సూచనలు. శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యమవచ్చు. అధికారులతో అప్రమత్తత అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ మేలు.
తుల: శుభఫలితాలు, సౌభాగ్యసిద్ధి. ఒక సమస్య పరిష్కారం. సహాయం లభిస్తుంది; నూతన కొనుగోళ్లు సాధ్యం. హనుమాన్ చాలీసా చదవండి.
వృశ్చికం: స్పష్టమైన ఆలోచనలతో విజయాలు. శుభవార్త ఇంట్లో ఆనందం నింపుతుంది. తోటివారి సాయం లభిస్తుంది. శివారాధన శుభప్రదం.
ధనుస్సు: ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఇంటి విషయాల్లో జాగ్రత్త. కుటుంబంలో స్వల్ప అభిప్రాయ భేదాలు. దుర్గా స్తోత్రం చదవాలి.
మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రత అవసరం. అనవసర నిందలు రావచ్చు. నవగ్రహ శ్లోకాలు శుభం.
కుంభం: దృఢనిశ్చయంతో ప్రయత్నిస్తే ఫలితం. బంధుప్రీతి, భోజన సౌఖ్యం. ఉల్లాసం పెరుగుతుంది. ఇష్టదైవ ధ్యానం మేలు.
మీనం: అభివృద్ధికి సంబంధించిన వార్తలు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!