
న్యూస్

సముద్రంలో దొరికే కొన్ని అరుదైన చేపలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఇవి వేల నుంచి లక్షల రూపాయల వరకు ధర పలుకుతాయి. అయితే జపాన్లో తాజాగా జరిగిన ఓ చేపల వేలం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జపాన్ రాజధాని టోక్యో లోని ప్రసిద్ధ తొయోసు చేపల మార్కెట్ కు 243 కిలోల బరువున్న భారీ బ్లూఫిన్ ట్యూనా చేపను తీసుకొచ్చారు. ఈ అరుదైన చేపకు జరిగిన వేలంలో తీవ్ర పోటీ నెలకొంది.
చివరకు ప్రముఖ సుషి సంస్థ కియోమురా అధ్యక్షుడు కియోషి కిమురా ఈ చేపను 3.24 మిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.29 కోట్లకు సమానం కావడం విశేషం.
ప్రతి సంవత్సరం జరిగే ఈ వేలంలో బ్లూఫిన్ ట్యూనా అత్యధిక ధరకు అమ్ముడవడం ఆనవాయితీగా మారింది. తాజా వేలం మరోసారి జపాన్లో సముద్ర ఆహారానికి ఉన్న విలువను ప్రపంచానికి చాటిచెప్పింది.




.jpeg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!