

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్(India-AI Impact Summit) 2026లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలు మన జీవితాలను పూర్తిగా మార్చేస్తాయని చెప్పారు. వ్యాక్సిన్లు, విమానాలు వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. మనిషికి పరిమితులు ఉన్నప్పటికీ, మనిషి సృష్టించిన అత్యున్నత ఆవిష్కరణ అయిన ఏఐ ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. ఏఐ మనిషికంటే ఎక్కువ తెలివితేటలు చూపుతోందని, ఏఐ శకం ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు.
ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలపై ప్రభావం చూపుతోందని సీఎం తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయరంగానికి ఇది ఎంతో ఉపయోగకరమని చెప్పారు. తెలంగాణలో ఏఐ స్టార్టప్స్ మంచి పురోగతి సాధిస్తున్నాయని వెల్లడించారు. అలాగే, జీఎస్టీ కౌన్సిల్ తరహాలో నేషనల్ ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాంటి కౌన్సిల్ ఏర్పడితే దేశవ్యాప్తంగా ఏఐ అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!