
సినిమాలు

తెలంగాణలో ఇకపై ఇన్-సర్వీస్ టీచర్లు కూడా తప్పనిసరిగా TET క్వాలిఫై అయి ఉండాలి అని ప్రభుత్వం నూతన ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు తమ సర్వీసును కొనసాగించాలన్నా, భవిష్యత్లో ప్రమోషన్లు పొందాలన్నా TET పాస్ అవడం కంపల్సరీగా నిర్ణయించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ఆధారంగా విద్యాశాఖ ఇవాళ ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ నిబంధన 2009 తర్వాత నియమితులైన సుమారు 30 వేల మంది టీచర్లకు వర్తించనుంది. రానున్న రెండు సంవత్సరాలలో ఈ టీచర్లు తప్పనిసరిగా TET పాస్ కావాలి అని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం, TET పాస్ అయితేనే టీచర్ల సర్వీస్ కొనసాగింపు మరియు ప్రమోషన్ల అర్హత నిర్ధారించబడుతుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!