

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 16 నుంచి Netflix వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారం కాగా, వాటికి ముగింపు పలుకుతూ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్, తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు.
ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్-డ్రామాగా రూపొందింది. చిన్ననాటి నుంచి సేవాభావంతో ఎదిగిన ఓ యువకుడు తర్వాత ఏసీపీగా మారి, తన గురువైన ముఖ్యమంత్రిని రక్షించే కథ చుట్టూ సినిమా తిరుగుతుంది. అసాంఘిక శక్తులతో పోరాడే హీరో పాత్రలో పవన్ కళ్యాణ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!