
క్రీడలు

పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు ఆందోళన చేపట్టారు. కర్రలు, రాళ్లతో భద్రతా ఏర్పాట్ల పై దాడి చేశారు. ఇరాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ కొందరు గేట్లు దాటి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కార్యాలయానికి నిప్పుపెట్టే యత్నం కూడా జరిగినట్లు సమాచారం.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!