

ఇరాన్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణమైనా దాడులు జరగొచ్చన్న భయాందోళనలు, విద్యార్థుల నిరసనలతో అక్కడి వాతావరణం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు వెంటనే ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం అత్యవసర సూచనలు జారీ చేసింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు సహా అందరూ అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా వీలైనంత త్వరగా బయటకు రావాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. తమ ప్రయాణ పత్రాలు, గుర్తింపు కార్డులు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని, అవసరమైతే రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు. అణు చర్చలు సఫలం కాకపోవడంతో ఉద్రిక్తతలు పెరిగి, రాజధానిలో విద్యార్థి నిరసనలు చెలరేగడంతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!