
న్యూస్

బెంగాల్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమార్‌గ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సుభేందు సర్కార్ పై టీఎంసీ కార్యకర్తలు దాడికి దిగినట్లు సమాచారం. ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో స్థానికులతో వాగ్వాదం జరగడంతో ఈ ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సుబేందు అక్కడి నుంచి తప్పించుకొని సమీపంలోని పొలాల్లోకి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.


















.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!