

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న పురుష: సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో, సరస్వతి బత్తుల సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా, వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. సప్తగిరి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్‌ను సృష్టించింది. పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తూ ఆకట్టుకుంటున్నాయి. సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ, కోటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!