
టెక్నాలజీ

వెనెజువెలాలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితులు తప్ప వెనెజువెలాకు ప్రయాణాలు చేయవద్దని భారతీయులకు సూచించింది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన ఘటన తర్వాత అక్కడ భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే వెనెజువెలాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని విదేశాంగ శాఖ సూచించింది. అలాగే కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని, స్థానిక పరిస్థితులపై అధికారిక సమాచారాన్ని గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.







.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!