

మారిషస్ సంస్కృతిలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు అంతర్భాగంగా ఉన్నాయని, భారత్–మారిషస్ దేశాలను కలిపే బలమైన సాంస్కృతిక బంధంగా తెలుగు నిలుస్తోందని మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తెలిపారు. గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఆయన, భాష, వారసత్వం, సంస్కృతితోనే దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని అన్నారు. మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మాత్రమే కాకుండా అత్యవసరమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి ‘భారతమిత్ర’ బిరుదుతో సత్కరించారు.
మారిషస్లో ఉగాది జాతీయ సెలవు దినంగా జరుపుకుంటున్నామని, విద్యాసంస్థల్లో తెలుగు బోధిస్తున్నామని అధ్యక్షుడు తెలిపారు. మారిషస్ జాతీయ నిర్మాణంలో అక్కడి తెలుగు సమాజం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 2003లో మారిషస్ పర్యటన సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రాచీన భాషలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, తెలుగు భాషాభివృద్ధిపై ఈ మహాసభల్లో ఫలప్రదమైన చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!