

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెల హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన నేపథ్యంలో, దావోస్‌లో కూడా తెలంగాణ ఆశించిన లక్ష్యాలను సాధించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ప్రపంచానికి చాటి చెప్పాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఈ పర్యటన ద్వారా నెరవేరింది.
ఈ పర్యటనలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రెండు కీలక వరల్డ్ ఎకనమిక్ ఫోరం సెషన్లలో పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలో అప్ సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది. అనంతరం ముఖ్యమంత్రి జూరిచ్ ద్వారా అమెరికా పర్యటనకు బయల్దేరగా, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!